వైయ‌స్ జ‌గ‌న్ చేసిన మేలును నాయీ బ్రాహ్మ‌ణులు ఎప్ప‌టికీ మ‌రువ‌రు 

మ‌ళ్లీ ఆయ‌న ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రానికి మంచి రోజులు

నాయీ బ్రాహ్మ‌ణ సంఘం నాయ‌కుల స్ప‌ష్టీక‌ర‌ణ 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా శ్రీ ధ‌న్వంత‌రి మ‌హారాజ్ జ‌యంతి వేడుక‌లు 

తాడేప‌ల్లి: నాయీ బ్రాహ్మణుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఎంతగానో కృషి చేశారని, ప్రతి ఆలయ పాలకవర్గంలో నాయీ బ్రాహ్మణులకు స్థానం కల్పించేలా చారిత్రాత్మకమైన జీవోను తీసుకొచ్చిన ఘనత ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌ని నాయీ బ్రాహ్మ‌ణ సంఘ నాయ‌కులు సంతోషం వ్య‌క్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శ్రీ ధ‌న్వంతరి మ‌హ‌రాజ్ జ‌యంతి వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సంఘం నాయ‌కులు మాట్లాడుతూ దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత కల్పించి, వారి  కుటుంబాలకు జ‌గ‌న్ ఆర్థికంగా అండగా నిలిచారని చెప్పారు. రాబోయే కాలంలో ధన్వంతరి స్వామి ఆశీస్సులతో వైఎస్ జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. శ్రీ ధన్వంతరి మహరాజ్ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గత 12 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. శుక్ర‌వారం జ‌రిగిన వేడుక‌ల్లో పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయ‌ణ మూర్తి, మాజీ ద్వారక తిరుమల బోర్డు మెంబర్ బంధరావూరి నందిని స‌హా నాయీ బ్రాహ్మ‌ణ సంఘం స‌భ్యులు భారీగా హాజ‌ర‌య్యారు. 

నాయీ బ్రాహ్మ‌ణుల‌కు జ‌గ‌న్ చేసిన మేలును మ‌రువ‌లేం
- యానాది, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు

ధన్వంతరి స్వామి ఆశీస్సులతో వైఎస్ జగన్ గారికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగు ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను. ఆయుర్వేద వైద్య వృత్తికి, నాయీ బ్రాహ్మణులకు అనాదిగా విడదీయలేని సంబంధం ఉంది. గతంలో దేవాలయాల పాలకవర్గాల్లో నాయీ బ్రాహ్మణులకు ఎలాంటి గుర్తింపు లేని పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి దేవాలయ పాలకవర్గంలో ఒక నాయీ బ్రాహ్మణుడికి స్థానం కల్పిస్తూ చట్టం తీసుకొచ్చి శాశ్వత ప్రాతిపదికన గుర్తింపు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిదే. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు తిరుమలలో కూడా శాశ్వత ఉద్యోగాలు, రూ.22 వేల వేతనం అందించేలా చర్యలు తీసుకున్నారు. నాయీ బ్రాహ్మణుల సంక్షేమం, ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం కోసం ఇన్ని కార్యక్రమాలు అమలు చేసిన వైఎస్ జగన్ గారికి ఈ సందర్భంగా మా సామాజిక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

నాయీ బ్రాహ్మ‌ణుల‌కు అండ‌గా నిల‌బ‌డింది జ‌గ‌నే
- కనకారావు, కార్పొరేషన్ మాజీ డైరెక్టర్

గత 12 సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ భగవాన్ ధన్వంతరి స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నాయీ బ్రాహ్మణులు అనాదిగా ఆయుర్వేద వైద్యం, వాయిద్యం వంటి వృత్తుల ద్వారా సమాజానికి సేవలు అందిస్తున్నారు. నాయీ బ్రాహ్మణులు, బీసీ వర్గాల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేసి మాకు అండగా నిలిచిన నాయకుడు  వైఎస్ జగన్ గారు. మా సామాజిక వర్గం అభ్యున్నతికి, సంక్షేమానికి ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేం. ధన్వంతరి స్వామి ఆశీస్సులతో 2029లో వైఎస్ జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూసుకుంటాం. 

ప్ర‌జారోగ్యంపై జ‌గ‌న్ గారికి ఉన్న చిత్త‌శుద్ధి గొప్ప‌ది
- పుల్లయ్య,  కార్పొరేషన్ మాజీ చైర్మన్

ధన్వంతరి స్వామి ఆరోగ్య ప్రదాత కాగా, కరోనా విపత్కర సమయంలో వైద్యో నారాయణ అన్నట్టుగా వైఎస్ జగన్ గారు ప్రజలందరి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి వైద్యపరంగా అండగా నిలిచారు. కేవలం నాయీ బ్రాహ్మణులకే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కూడా ప్రజలకు సక్రమంగా అందని పరిస్థితి ఏర్పడింది. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ఆలోచించకుండా కక్షపూరితంగా వ్యవహరించడం బాధాకరం. వైఎస్ జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్ర‌మాణం చేసి ప్ర‌జలందరికీ ఆరోగ్య భద్రతతో పాటు సంక్షేమ పాలన అందించాలని ధన్వంతరి స్వామిని కోరుకుంటున్నాను.

Back to Top