అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత, స్థాయి మంత్రి పయ్యావుల కేశవ్‌కు లేదని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలీస్‌స్టేషన్లలో నిర్బంధిస్తూ మరోవైపు మంత్రి పయ్యావుల కేశవ్ నీతులు మాట్లాడటం సరికాదని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో యథేచ్ఛగా రిగ్గింగ్ జరిగిందని, సీఐ రాజు ద్వారా రిగ్గింగ్ చేయించిన ఘనత పయ్యావుల కేశవ్‌దేనని ఆరోపించారు. పయ్యావుల రాజకీయ చరిత్రంతా రిగ్గింగ్, నేరపూరిత రాజకీయాలతోనే సాగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పైసా ఖర్చు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొన్న వైయస్ఆర్‌సీపీ శ్రేణులకు హ్యాట్సాఫ్ అని విశ్వేశ్వరరెడ్డి అభినందించారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, పోలీసుల నిర్బంధాల మధ్య కూడా పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.