కురుపాం గురుకులంలో కలకలం.. 44 మంది విద్యార్థినులకు అస్వస్థత

పార్వతీపురం మన్యం జిల్లా: కురుపాం గురుకుల రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 44 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు విద్యార్థినులకు జ్వరాలు రావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ముగ్గురు విద్యార్థినులు కురుపాం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారికి పాఠశాలలోని సిక్‌ రూమ్‌లో వైద్యం అందిస్తున్నారు. గతంలో ఇదే పాఠశాలలో అనారోగ్యంతో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనలు ఉండటంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

అనారోగ్యంతో ఉన్న విద్యార్థినులను పాఠశాల సిబ్బంది బయటకు పంపకుండా పాఠశాలలోనే ఉంచినట్లు సమాచారం. 44 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో పాఠశాలలో పరిస్థితులపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Back to Top