శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా రిగ్గింగ్ జరిగినట్లు చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీడీపీ–బీజేపీ నేతలు ఎన్నికల సిబ్బందిని బెదిరించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. రిగ్గింగ్‌కు సంబంధించిన దృశ్యాలు రాత్రి నుంచే సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, ముదిగుబ్బలో రీ–పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వకపోవడంపై వైయస్ఆర్‌సీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించి, ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి.