ఎన్నికల అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరపాలి

బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

:వైఎస్సార్ సీపీ నేత విశ్వేశ్వర రెడ్డి డిమాండ్

అనంతపురంలో మీడియాతో మాాట్లాడిన వైఎస్సార్ సీపీ నేత విశ్వేశ్వర రెడ్డి

నేర రాజకీయాల గురించి మాట్లాడే హక్కు మంత్రి కేశవ్ కు లేదు

ఆయన సొంత గ్రామంలోనే దశాబ్ధాలుగా స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగలేదు

 విశ్వశ్వేర రెడ్డి స్పష్టీకరణ

ఎలక్షన్ ఏజెంట్లను నిర్భందించి ఎన్నికలా..?

ఉరవకొండ, కూడేరు సీఐలను సస్పెండ్ చేయాలి

వైఎస్సార్ సీపీ నేత విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం

దమ్ముంటే మళ్లీ ఎన్నికలు నిర్వహించండి

ప్రజాస్వామ్య పరిరక్షణకు మా పోరాటం కొనసాగుతుంది

:విశ్వేశ్వర రెడ్డి సవాల్

అనంతపురం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్న పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు.  అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చగా మారిందిని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ,  ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అనంతపురం జిల్లాలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార బలంతో వైెఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలతో ఎన్నికలు జరిపించిన మంత్రి పయ్యావుల కేశవ్ కు ప్రజాస్వామ్యం, నేర రాజకీయాల గురించి  మాట్లాడే నైతిక హక్కు లేదని ఆక్షేపించారు.  కేశవ్ తన  సొంత గ్రామంలోనే దశాబ్దాలుగా స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. మంత్రి కేశవ్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అబద్ధాలను నిర్భయంగా చెప్పడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని ఎద్దేవా చేశారు. అధికార దర్పంతో జరిగిన ప్రతి తప్పునూ సమర్థించుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. గత మున్సిపల్ ఎన్నికల నుంచి ప్రస్తుత ఎన్నికల వరకు జరిగిన నామినేషన్ల అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కేశవ్ గుర్తు చేసుకోవాలిని విశ్వేశ్వరరెడ్డి హితవు పలికారు. న్యాయస్థానాలు తీవ్రంగా స్పందించిన అంశాలను పక్కనపెట్టి, రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు నుంచే రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఎస్పీ, డీఐజీ తదితర ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా,  ఆచరణలో కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.   వెన్నుపోటు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్దంగా  ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యతను విస్మరించి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను అణచివేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.   ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే... 

ఏజెంట్లను నిర్భంధించి ఎన్నికలా..?

ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి రెండున్నర గంటల సమయంలో కూడా మా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు నుంచి ఇబ్బందులు పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా అరెస్టులు చేయడం దారుణం.  మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేసి, ఎన్నికల ఏజెంట్లను, పార్టీ నాయకులను అరెస్టు చేయడం ఏ విధమైన న్యాయం?  ఉరవకొండ సీఐ, కూడేరు సీఐల వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరపాలి.  ఎన్నికల ఏజెంట్లను నిర్బంధించిన ఘటనపై సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాలి.  రాత్రివేళల్లో అక్రమంగా అరెస్టులు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.  టీడీపీకి చెందిన ఎంతమందిని అరెస్టు చేశారో ప్రభుత్వం లెక్కలు బయటపెట్టాలి.  
మా పార్టీకి చెందిన ఉరవకొండ నియోజకవర్గ నాయకులు, మండల స్థాయి ప్రతినిధులు, ఎన్నికల ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేశారు. మండల వైస్‌ప్రెసిడెంట్ కుటుంబ సభ్యులను కూడా నిర్బంధించడం ఎంతవరకు సమంజసం? ఉండబండ, రాయంపల్లి, కొటాలపల్లి, జనార్ధనపల్లి తదితర గ్రామాల్లో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులపై విచారణ జరగాలి. రాయంపల్లిలో మా మండల పార్టీ అధ్యక్షుడిని ఎందుకు అరెస్టు చేశారు? ఆయనపై ఉన్న కేసులేమిటి? ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కుటుంబ సభ్యులను సైతం నిర్బంధించడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పాలి.   
 
 
మళ్లీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం ఉందా?

ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి ఓట్లు, విదేశాల్లో ఉన్నవారి ఓట్లు, మరణించిన వారి ఓట్లు కూడా వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలి. మేము ఆరోపించిన ప్రతి అంశంపైనా విచారణ జరిపించి, అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.  కొనకొండ ప్రాంతంలో మా ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపించారనే ఆధారాలు ఉన్నాయి. ఉరవకొండ రూరల్ సీఐ మా ఏజెంట్లతో దురుసుగా ప్రవర్తించారని, చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చారని ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి ఘటనలపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించాలి.  
ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఒక్క రూపాయి కూడా పంచకుండా, నిబద్ధతతో ఎన్నికల్లో నిలబడిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.   ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుంది. అధికార పార్టీ బెదిరింపులకు, పోలీసుల నిర్బంధాలకు మా నాయకులు, కార్యకర్తలు భయపడరు. ప్రజల మద్దతుతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుంది అని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత విశ్వేశ్వర రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top