తిరుపతి సాయినగర్‌లో దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి

తిరుపతి సాయినగర్‌లో పోలింగ్‌ బూత్‌ వద్దకు దొంగ ఓటర్లను టీడీపీ నాయకులు తరలిస్తున్నట్లు గుర్తించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దొంగ ఓటర్లు ఓ దుకాణంలో దాక్కున్నట్లు గుర్తించి బయటకు తీసుకొచ్చే క్రమంలో టీడీపీ నాయకులు రభస సృష్టించారు. చెవిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతో సాయినగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Back to Top