రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

బాధిత‌ కుటుంబానికి వడ్డీ రఘురామ్‌ నాయుడు ఆర్థిక సాయం 

తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం వెంకటరమణగూడెం గ్రామానికి చెందిన బొట్టా ముకేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి వడ్డీ రఘురామ్‌ నాయుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ముకేంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Back to Top