నంచర్లలో ఎంపీటీసీ అభ్యర్థి దంపతులకు బెదిరింపులు

 నామినేషన్‌ ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి 

 కర్నూలు జిల్లా:  ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నంచర్ల గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి, ఆయన భార్యను గుమ్మనూరు నారాయణ కిడ్నాప్‌ చేసి, నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకునేలా అభ్యర్థిపై ఒత్తిడి చేశారు.  ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి అభ్యర్థికి ఉన్న ప్రజాస్వామ్య హక్కు. నంచర్ల ఎంపీటీసీ అభ్యర్థి, ఆయన భార్య భద్రతపై తక్షణమే దృష్టి సారించి, వారి ఆచూకీపై స్పష్టత తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు కోరారు.  ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అభ్యర్థులు ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలి. 

Back to Top