కృష్ణా జిల్లా: ప్రతి గడపకూ ధైర్యాన్ని, ప్రతి కుటుంబానికీ భరోసాను అందించే నాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్ఆర్‌సీపీ ప్రచార విభాగం జోన్-3 అధ్యక్షురాలు మైల రత్నకుమారి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన వైయస్ జగన్ నాయకత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో మైల రత్నకుమారి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి, వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలిచే నాయకత్వానికి అండగా నిలవాల్సిన సమయమిదని, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు. వైయస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన ఆర్థిక భరోసాను గుర్తుచేస్తూ, ప్రజల భవిష్యత్తుకు నమ్మకమైన అండగా వైయస్ఆర్‌సీపీ నిలుస్తుందని రత్నకుమారి వివరించారు. కృత్తివెన్ను మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి పులగం సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ అభ్యర్థి తిరుమాని ప్రశాంతిలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల ఆశీర్వాదంతో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.