అమలాపురం: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల మధ్యకు వెళ్తూ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్. అమలాపురం పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17వ వార్డులో పర్యటించిన వారు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. వైయస్ఆర్‌సీపీ 17వ వార్డు అభ్యర్థి నాగారపు వెంకటేశ్వరరావును, చైర్‌పర్సన్ అభ్యర్థి దూడల విరీతాదేవిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ప్రజలతో మమేకమవుతూ ప్రచారాన్ని కొనసాగించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురం ఎన్నికల పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య, పట్టణ అధ్యక్షుడు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.