తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు, ఎల్లో మీడియా మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న హింస, నామినేషన్ల అడ్డగింతలు, ఎన్నికల రిగ్గింగ్‌పై జాతీయస్థాయిలో చర్చ జరుగుతుండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్సార్ కుటుంబంలోని మహిళల పేరుతో నకిలీ లేఖలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. బెంగళూరు లోని ఆస్తులు మీవి కాదంటూ వైఎస్ భారతి గారు షర్మిల గారికి లేఖ రాశారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇది వెన్నుపోటు పార్టీ సృష్టించిన ఫేక్ ప్రచారం మాత్రమే. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేక, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక, నిత్యావసర ధరలను నియంత్రించలేక చంద్రబాబు ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారు. బియ్యం, వంటనూనె, ఉల్లిపాయల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిపై సమాధానం చెప్పకుండా కుటుంబ వ్యవహారాలను రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతూ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతున్న తరుణంలో, ఆ పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ నకిలీ లేఖల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఆ కంటెంట్‌ను తక్షణం తొలగించాలి: మహిళల గౌరవానికి భంగం కలిగించేలా నకిలీ లేఖ ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ముఖ్యమంత్రి చంద్రబాబుకి మహిళల పట్ల నిజంగా గౌరవం ఉంటే ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలి. ఏబీఎన్, టీవీ5తో పాటు ఈ నకిలీ లేఖను ప్రచారం చేసిన ఎల్లో మీడియా సంస్థలన్నీ వెంటనే సంబంధిత కంటెంట్‌ను తొలగించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. వైఎస్సార్ కుటుంబంలోని మహిళలపై అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఈ నకిలీ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సృష్టించారు, ఎవరు ప్రచారం చేశారు అనే అంశాలపై సైబర్ క్రైమ్ దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం చంద్రబాబు ఇప్పటికైనా మానుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకోవడం, మరోవైపు నకిలీ ప్రచారాలతో ప్రజల దృష్టిని మళ్లించడం ఆపాలి. ఇంకా ఈ తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని పుత్తా శివశంకర్ స్పష్టం చేశారు.