విజయనగరం జిల్లా: టీడీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను కుమార్తె ముస్కాన్ జైన్ అలియాస్ సిరి సహస్ర బీసీ కుల ధ్రువీకరణ పత్రంతో జెడ్పీటీసీ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె ఓసీ సామాజిక వర్గానికి చెందినవారని పేర్కొంటూ, బీసీ సర్టిఫికెట్‌తో నామినేషన్ దాఖలు చేయడంపై వైయస్ఆర్‌సీపీ జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. అయితే, వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదును జిల్లా ఎన్నికల అధికారి తోసిపుచ్చారు. ఈ వ్యవహారంపై వైయస్ఆర్‌సీపీ వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటానికి సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ రేపు హైకోర్టును ఆశ్రయించనుంది. దత్తత పేరుతో బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రయోజనాలను ఇతర సామాజిక వర్గాలకు కట్టబెట్టే విధానాన్ని అడ్డుకుని, బీసీల హక్కులను పరిరక్షించేందుకు వైయస్ఆర్‌సీపీ పోరాటాన్ని కొనసాగించనుంది.