లింగాలలో వైయ‌స్ఆర్‌సీపీ నేతల ముందస్తు అరెస్టులు

 డీఐజీ కోయ ప్రవీణ్‌ ఆదేశాలతో పోలీసుల చర్యలు 

వైయ‌స్ఆర్‌ జిల్లా: జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో లింగాల మండలంలో పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. డీఐజీ కోయ ప్రవీణ్‌ ఆదేశాలతోనే ఈ అరెస్టులు జరిగినట్లు సమాచారం. బైండోవర్‌, ఇతర కేసుల పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జడ్పీటీసీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా అడ్డుకుని, ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణకు కూడా సిద్ధమవుతున్నారని పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డీఐజీ కోయ ప్రవీణ్‌ లింగాల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన సమయంలో ముందస్తు అరెస్టులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Back to Top