జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి అరాచకాలు

వైయ‌స్ఆర్‌ జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నేతల ముందస్తు అరెస్టులు

వైయ‌స్ఆర్‌ జిల్లా: జడ్పీటీసీ ఎన్నికల వేళ వైయ‌స్ఆర్‌ జిల్లాలో కూటమి ప్రభుత్వ అరాచకాలు కొనసాగుతున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు లేకుండా చేసి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులను ఉపయోగించుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా లింగాల మండలంలో పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు.

 నేతల అరెస్టులతో ఎన్నికలపై ప్రభావం

జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించి, వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను అడ్డుకోవడం ద్వారా ఎన్నికలను ఏకపక్షం చేసుకునేందుకు కూటమి నేతలు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను ముందుగానే అరెస్ట్‌ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో పార్టీ శ్రేణుల భాగస్వామ్యాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

 పోలీస్‌స్టేషన్‌కు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

లింగాల మండలంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతల ముందస్తు అరెస్టుల విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తమ పార్టీ నాయకులను విడుదల చేసే వరకు పోలీస్‌స్టేషన్‌ వద్దే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

Back to Top