నందికొట్కూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం! 

చైర్మన్‌ అభ్యర్థి, కౌన్సిలర్లను అభినందించిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, సుదీర్‌ దారా 

నందికొట్కూరు: మున్సిపల్‌ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై నమ్మకంతో ఓటు వేసి వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి, 23 వార్డుల కౌన్సిలర్లను ఆదరించిన పట్టణ ప్రజలకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త సుదీర్‌ దారా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు చెంపపెట్టు అని సుదీర్‌ దారా పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన యువత, మహిళలు, పెద్దలకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

సూపర్‌ సిక్స్‌ హామీలకు చంద్రబాబు ఎగనామం

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కేసీ కెనాల్‌కు నీరు ఇవ్వాలని కోరుతుంటే, పరిశ్రమలకు నీటిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

నందికొట్కూరు అభివృద్ధికి కట్టుబడి ఉంటాం

ఈ విజయం తమ ఒక్కరిదే కాదని, నందికొట్కూరు అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరిదని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, సుదీర్‌ దారా పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, నందికొట్కూరు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రశాంతంగా, ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. 

Back to Top