నంద్యాల: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలకు ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. కేసీ కెనాల్‌కు నీరు ఇవ్వాలని రైతులు కోరుతుంటే, ఫ్యాక్టరీలకు నీటిని తరలించడం ఏమిటని బైరెడ్డి ప్రశ్నించారు. రాయలసీమలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైయస్ఆర్‌సీపీ జెండా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైయస్ఆర్‌సీపీ విజయపరంపర కొనసాగుతుందని, పార్టీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.