మేయర్‌ అభ్యర్థి బండి దీప్తికి వైయ‌స్ఆర్‌సీపీ నేతల భరోసా

కడప నగరంలో బండి దీప్తి నివాసానికి వెళ్లి పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌ బాషా

కడప: వైయ‌స్ఆర్‌సీపీ కడప మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి నివాసానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌ బాషా తదితర నాయకులు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెబుతూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. “మీరు నైతికంగా విజయం సాధించినట్లే. పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి” అంటూ బండి దీప్తికి నాయకులు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆమెకు సంఘీభావం తెలిపారు.

  పలువురు నాయకుల పరామర్శ

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ జమీల్‌, రాష్ట్ర ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తోట కృష్ణ, జిల్లా బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి షిండే రవిచంద్రరావు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సమ్ముటూరు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఫయాజ్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

Back to Top