తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ ఏ. చక్రపాణి మృతి పట్ల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. చక్రపాణి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో చక్రపాణికి సన్నిహిత రాజకీయ, వ్యక్తిగత అనుబంధం ఉండేదని వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు. 2007లో వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనమండలిని పునరుద్ధరించి, తొలి ఛైర్మన్‌గా డాక్టర్ ఏ. చక్రపాణిని ఎంపిక చేశారని తెలిపారు. శాసనమండలి ఛైర్మన్‌గా పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణకు చక్రపాణి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, చక్రపాణి ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ప్రార్థించారు.