అనంతపురం: అనంతపురం మేయర్ ఎన్నికలో వైయస్సార్‌సీపీ సాధించిన విజయం నగర ప్రజల ఆత్మగౌరవానికి, ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. మేయర్‌గా ఎన్నికైన చిట్టూరి రమేష్ గౌడ్‌తో కలిసి పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ అనేక ఒత్తిళ్లు, ప్రలోభాలు, కుట్రలకు పాల్పడినా కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా పార్టీ విజయానికి కృషి చేశారని అభినందించారు. అనంతపురం నగర ప్రజలు ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపుల మధ్య కూడా వైయస్సార్‌సీపీని ఆదరించడం తమపై మరింత బాధ్యత పెంచిందని మేయర్‌గా ఎన్నికైన రమేష్ గౌడ్ అన్నారు. ప్రెస్‌మీట్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..: రెండేళ్లుగా నగరంలో అవినీతి రాజ్యమేలుతోంది. :అనంత వెంకట్రామిరెడ్డి. వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంతపురం మేయర్ ఎన్నికల్లో గెలిచింది వైఎస్సార్‌సీపీ మాత్రమే కాదు.. నగర ప్రజల ఆత్మగౌరవం. రెండున్నరేళ్లుగా కూటమి పాలనలో అనంతపురంలో ప్రశాంతత కరువైంది. భూదందాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అధికార పార్టీ నాయకుల అవినీతి పెరిగిపోయాయి. వీటికి అడ్డుకట్ట వేయాలనే ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ ఎన్నో ఒత్తిళ్లు, ప్రలోభాలు, కుట్రలకు పాల్పడినా బెదరకుండా, అదరకుండా పార్టీ గెలుపు కోసం పని చేశారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు జరిగిన ఎన్నికల తీరును ప్రజలంతా గమనించారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించి, ప్రచారానికి కూడా అవకాశం లేకుండా చేసినా 16,400 ఓట్లు వచ్చాయి. ప్రజాభిప్రాయం ఏమిటో చంద్రబాబు ఇకనైనా గుర్తించాలి. అనంతపురం ఎన్నికల్లో కలెక్టర్, ఎస్పీ సహా అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి, నిబంధనలకు విరుద్ధంగా బూతుల్లోకి వెళ్లే అధికార పార్టీ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అధికారులకు వైఎస్సార్‌సీపీ తరఫున ధన్యవాదాలు. ఎమ్మెల్యేలు, మంత్రులు నగర అభివృద్ధికి సహకరించాలి. :చిట్టూరు రమేష్‌గౌడ్. అనంతపురం నూతన మేయర్. అనంతపురం కార్పొరేషన్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఈ ఎన్నికలు జరిగాయి. నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు చేశారు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య కూడా వైయస్సార్‌సీపీని ఆదరించిన ప్రజలకు శిరసు వంచి కృతజ్ఞతలు చెబుతున్నా. అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజల మద్దతుతో వైయస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇందుకు పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలతో పాటు, నగర ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్నికల్లో గెలిచిన, ఓడిన కార్పొరేటర్ అభ్యర్థులందరం ఒకే తాటిపై నిలబడి ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రజలకు జవాబుదారీతనంతో, పారదర్శకంగా సేవలందిస్తూ ఇచ్చిన హామీలను కార్యాచరణతో అమలు చేస్తాం. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను మేము అడిగేది ఒక్కటే. అనంతపురం అభివృద్ధికి సహకరించండి. రాజకీయాలు, కుట్రలు పక్కన పెట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. నగరానికి ఏది అవసరమో గుర్తించి అభివృద్ధికి తోడ్పడండి. అనంతపురం కార్పొరేషన్‌లో అవినీతికి తావు లేకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటాం.