వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌లు, దొంగ ఓట్లు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైయస్ఆర్‌సీపీ నాయకులు మండిపడ్డారు. పోలింగ్ రోజున పలు బూత్‌లను ఆక్రమించడం, దొంగ ఓట్లు వేయించడం, వైయస్ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులు, బెదిరింపులకు పాల్పడటం వంటి ఘటనలతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. ప్రజల స్వేచ్ఛాయుత ఓటు హక్కును కాలరాసి, రిగ్గింగ్‌లు, దౌర్జన్యాలతో సాధించిన విజయాన్ని నిజమైన గెలుపు అంటారా అని జీవీ ఆంజనేయులును ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా అధికార బలంతో వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అని పేర్కొన్నారు.