నాయుడుపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా తమ్మిరెడ్డి రాజేశ్వరమ్మ ఘన విజయం!

టీడీపీ అభ్యర్థిపై 1,550 ఓట్ల మెజారిటీతో గెలుపు

 తిరుపతి జిల్లా: నాయుడుపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి తమ్మిరెడ్డి రాజేశ్వరమ్మ ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిపై 1,550 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో నాయుడుపేటలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది.

రాజేశ్వరమ్మ విజయంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన పట్టణ ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. 1,550 ఓట్ల మెజారిటీతో సాధించిన ఈ విజయం నాయుడుపేట మున్సిపల్‌ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

Back to Top