అనంతపురం: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి అజేష్‌బాబుపై 5,981 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం ఆయన తన నివాసానికి చేరుకోగా మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతపురం ప్రజల ఆదరణకు భావోద్వేగానికి గురైన రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు, తనను ఆదరించిన అనంతపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నగర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని రమేష్ గౌడ్ వెల్లడించారు.