తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

 అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచన

అరకు: తుఫాన్‌ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు అరకు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మన్యం ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, పర్యాటక ప్రాంతాలు, నదులు, వాగులు, వంకలు, జలపాతాల సమీపానికి వెళ్లవద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామ పెద్దలు, యువత, మీడియా ప్రతినిధులు ఈ సమాచారాన్ని వాట్సాప్‌, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసి అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

Back to Top