విశాఖపట్నం: వైయస్ భారతమ్మ పేరుతో ఏబీఎన్ ఛానల్‌లో తప్పుడు లేఖను ప్రచారం చేయడాన్ని వైయస్ఆర్‌సీపీ విశాఖపట్నం మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి తీవ్రంగా ఖండించారు. షర్మిలకు భారతమ్మ లేఖ రాసినట్లు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రచారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వెంటనే వైయస్ భారతమ్మకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకేనా? స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే తప్పుడు లేఖ ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారని వరుదు కళ్యాణి పేర్కొన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. తప్పుడు లేఖల ప్రచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేయడం సరికాదని స్పష్టం చేశారు. మీడియా సంస్థలకు బాధ్యత ఉండాలి ప్రజలకు వాస్తవాలను అందించాల్సిన మీడియా సంస్థలు ప్రచురించే, ప్రసారం చేసే సమాచారంపై బాధ్యత వహించాలని వరుదు కళ్యాణి అన్నారు. వైయస్ భారతమ్మ పేరుతో ప్రచారంలోకి తెచ్చిన లేఖ నిజమైనదా కాదా అన్న విషయాన్ని స్పష్టంచేయాలని, తప్పుడు ప్రచారం జరిగితే బాధ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తుల పేర్లను ఉపయోగించి ప్రజల్లో అపోహలు సృష్టించే ధోరణిని విడనాడాలని పేర్కొన్నారు.