తాడేపల్లి: ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 70 రోజుల పాటు కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షితో వైయస్ జగన్ మాట్లాడి, ఆయనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని వైయస్ జగన్ ఎమ్మెల్యే విరుపాక్షికి భరోసా ఇచ్చారు. వైయస్ఆర్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పి, పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు బుసినె శ్రీరాములు, యువ నాయకులు బుసినె లక్ష్మీనారాయణ, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బుసినె చంద్రశేఖర్, బుసినె మధుసూదన్, బుసినె మారుతి తదితరులు పాల్గొన్నారు.