నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తోటపల్లిగూడూరు మండలం పేడూరు గ్రామంలో టీడీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరాయి. తిక్కవరపు సనత్‌కుమార్‌రెడ్డి, తూపిలి ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన నాయకులు మాగుంట రామకృష్ణారెడ్డి, జగన్నాటి ఏడుకొండలు, సంగారు సారయ్య, సంగారపు శీనయ్య, నక్కా బాబు తదితరులకు మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ నాయకులకు గుర్తింపు కార్డులు అందజేశారు. టీడీపీ పాలనపై కాకాణి విమర్శలు ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా టీడీపీలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరడం ఆలోచించాల్సిన విషయమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీరుపై అసంతృప్తితో టీడీపీ శ్రేణులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నాయని విమర్శించారు. తన పార్టీ వారికే తిరిగి కండువాలు కప్పి, ఇతర పార్టీల నుంచి చేరికలుగా ప్రచారం చేసుకుంటున్నారంటూ సోమిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. వైయస్ఆర్‌సీపీ వైపు టీడీపీ శ్రేణులు అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీని వీడి ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీలో చేరేందుకు నాయకులు, కార్యకర్తలు ముందుకు వస్తున్నారని కాకాణి పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో వైయస్ఆర్‌సీపీలో చేరుతున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ మరింత బలహీనపడుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీలో చేరిన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.