పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్ఆర్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెంటచింతల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా సమావేశం నిర్వహించారు.