కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీలోకి టీడీపీకి చెందిన 12 కుటుంబాల చేరిక

ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పలువురు నాయకులు

కుప్పం: కుప్పం నియోజకవర్గంలోని అడవి బూదగురు పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 12 కుటుంబాలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌ అధ్యక్షతన, కుప్పం మండల కన్వీనర్‌ హెచ్‌.ఎం. మురుగేష్‌ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. నూతనంగా పార్టీలో చేరిన వారికి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎం. బాలకృష్ణ, ఏ. ముత్తుకరుప్పన్‌, వి. శేఖర్‌, ఎస్‌. సిద్ధప్ప, కె. సుబ్రమణ్యం, దొడతమ్మ, ఎం. సింగారవేలు, ఎం. జ్ఞానశేఖర్‌, అజిత్‌, రాజా, రజినీ, బి. మణి, దేవరాజ్‌, జనార్ధన్‌, తోటప్ప, కనకరాజ్‌, కొణ్నప్ప, వీరభద్రన్‌, మహేంద్రన్‌, అరుణాచలం, మద్దప్ప తదితరులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

Back to Top