శ్రీకాళహస్తిలో పోలీసుల లాఠీఛార్జ్‌!

 తొట్టంబేడులో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి కుమార్తెకు అడ్డంకులు 

తిరుపతి జిల్లా : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థితో కలిసి తొట్టంబేడుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు బియ్యపు మధుసూదనరెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి, ఆమె కుమారుడు ఆకర్షరెడ్డిని టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. తనపై మహిళా పోలీసులతో పాటు పురుష పోలీసులు కూడా లాఠీఛార్జ్‌ చేశారని పవిత్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారని ఆమె ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు, నాయకులకు అడ్డంకులు లేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 

Back to Top