తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పులివెందుల, పిడుగురాళ్ల, దాచేపల్లి, తిరుపతి, కడప సహా పలు ప్రాంతాల్లో అభ్యర్థులు, పార్టీ నాయకులపై దాడులు, బెదిరింపులు, గృహనిర్బంధాలు, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాలరాస్తూ భయానక వాతావరణం సృష్టించడం కూటమి పాలనలో ఎన్నికల ప్రక్రియ ఎదుర్కొంటున్న పరిస్థితికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనలు: పులివెందుల: మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు నిరంజన్‌రెడ్డి, అంజనప్ప ఇళ్లపై దాడులు. ఇంటి ముందు ఉన్న లారీ, స్కూటీకి నిప్పంటింపు. పార్లపల్లి రోడ్డులో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి శ్రీరాములు ఇంటి వద్ద ద్విచక్ర వాహనం దహనం. వేంపల్లి: వైయస్ఆర్‌సీపీ నాయకుడి కుటుంబంలో పుట్టినరోజు భోజనాల కార్యక్రమంలో విధ్వంసం. జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. నామినేషన్ కేంద్రానికి వెళ్లే అభ్యర్థులకు అడ్డంకులు. చక్రాయపేట: మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు లోమాడ శేషారెడ్డి, మాజీ సర్పంచ్ మేడిశెట్టి వెంకటసుబ్బయ్య, మండల ఉపాధ్యక్షుడు రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు. పోరుమామిళ్ల: వైయస్ఆర్‌సీపీ ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలింపు. జమ్మలమడుగు: కొండాపురం జడ్పీటీసీ అభ్యర్థి శివారెడ్డి, వైయస్ఆర్‌సీపీ నాయకుడు హరి నారాయణరెడ్డి అరెస్టు. ప్రొద్దుటూరు: కల్లూరు ఎంపీటీసీ అభ్యర్థి నాగేంద్రరెడ్డి అదుపులోకి తీసుకున్న పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు. నామినేషన్లకు వెళ్తున్న నరేన్‌రెడ్డి అరెస్టు. రాయచోటి: వైయస్ఆర్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులపై కేసులు. నాయకుల అరెస్టులు. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు అడ్డంకులు. బద్వేల్: ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ నివాసాల వద్ద పోలీసుల మోహరింపు. ఎన్నికల్లో పోటీ చేసే నాయకులను పోలీస్‌స్టేషన్లకు తరలింపు. పిడుగురాళ్ల: మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని వైయస్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి అదుపులోకి తీసుకుని నరసరావుపేటలోని ఆయన నివాసానికి తరలింపు. పల్నాడు జిల్లా: రెంటచింతల, కారంపూడి, దుర్గి, వెల్దుర్తి నామినేషన్ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లతో గుంపుల చేరిక. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు అడ్డంకులు. గురజాల, పిడుగురాళ్ల: నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రం వద్ద జడ్పీటీసీ అభ్యర్థి భారతి, ఆమె భర్త పెద్ద లక్ష్మారెడ్డిపై దాడి. తీవ్రంగా గాయపడిన పెద్ద లక్ష్మారెడ్డి ఆసుపత్రికి తరలింపు. దాచేపల్లి: జడ్పీటీసీ అభ్యర్థి వంగా పద్మావతిపై టీడీపీ మహిళా కార్యకర్తల దాడి. రొంపిచర్ల: ఎంపీటీసీ నామినేషన్లకు వచ్చిన వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోలీసుల నుంచి అడ్డంకులు. పోలీసులతో వాగ్వాదం, రోడ్డుపై బైఠాయింపు, లాఠీఛార్జ్. పలువురు కార్యకర్తలకు గాయాలు. రొంపిచర్ల పోలీస్‌స్టేషన్: వీరాటం గ్రామానికి చెందిన టీడీపీ రెండు వర్గాలు బీ-ఫారాల విషయంలో పరస్పరం దాడులు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు. మాచర్ల: ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు లాక్కోవడం. కడప జిల్లా పరిషత్ కార్యాలయం: జడ్పీటీసీ నామినేషన్లకు అడ్డంకులు సృష్టించేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తల చేరిక. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు ఆటంకాలు. పుంగనూరు: జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు బెదిరింపులు. నామినేషన్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు, ఇనుప కంచెల ఏర్పాటు. నిషేధాజ్ఞలు, పోలీస్ యాక్ట్ అమలు. బనగానపల్లె: వైయస్ఆర్‌సీపీ మైనారిటీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ అరెస్టు. పోలీస్‌స్టేషన్‌కు తరలింపు. చిప్పగిరి, ఆలూరు: ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, ఆయన సోదరులకు గృహనిర్బంధం. నామినేషన్లకు ఆటంకాలు కలిగించేందుకు ముందస్తు అరెస్టులపై ఎమ్మెల్యే అభ్యంతరం. పీలేరు, వాయల్పాడు: మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడు సాయికృష్ణారెడ్డి అరెస్టు. మదనపల్లె వైపు తరలింపు. పోలీసుల వైఖరికి నిరసనగా వాల్మీకిపురం గాంధీ బస్టాండ్ వద్ద చింతల రామచంద్రారెడ్డి ధర్నా. గుంతకల్లు, పామిడి: కొత్తపల్లి వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రమేష్‌కు బెదిరింపులు. నామినేషన్ వేస్తే కాళ్లు విరగ్గొడతామంటూ టీడీపీ నాయకుల ఫోన్ కాల్స్. సింహాద్రిపురం: ఎంపీటీసీ అభ్యర్థులకు అడ్డంకులు. ఈ ఘటనలో బీటెక్ రవి భార్య పేరు ప్రస్తావనకు వచ్చింది. వెదురుకుప్పం, జీడీ నెల్లూరు: ఎంపీటీసీ అభ్యర్థి రామయ్య, ఆయన కుమార్తెకు నామినేషన్ ప్రక్రియలో ఆటంకాలు. వెరిఫికేషన్ పేరుతో పలుమార్లు బయటకు పంపించి అనంతరం దాడి. కార్వేటినగరం, జీడీ నెల్లూరు: వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు అడ్డంకులు, దాడులు. సమన్వయకర్త కృపా లక్ష్మి, అభ్యర్థుల రోడ్డుపై బైఠాయింపు. శ్రీకాళహస్తి: మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి హౌస్ అరెస్ట్ నోటీసులు. రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సుధాకర్‌రెడ్డి, రేణిగుంట మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌లకు గృహనిర్బంధం. శ్రీకాళహస్తి, తొట్టంబేడు: మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి, కుమారుడు ఆకర్ష్‌రెడ్డికి నామినేషన్ల సమయంలో అడ్డంకులు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురికి గాయాలు. శ్రీకాళహస్తి: ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి డ్రైవర్ ప్రభుత్వ సర్వేయర్‌పై సిమెంట్ ఇటుకలతో దాడి. తలకు గాయమైన బాధితుడిని ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి. తిరుపతి: వైయస్ఆర్‌సీపీ 63వ డివిజన్ అభ్యర్థి జమున భర్త కేశవులుకు బెదిరింపులు. జమున సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ చేసినట్లు చూపడంపై అభ్యంతరం. చిలకలూరిపేట: మున్సిపల్ 47వ వార్డు వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి బెల్లంకొండ నరేంద్ర చౌదరి, కందుల శ్రీకాంత్‌గౌడ్‌పై దాడి. బీ-ఫారాల చించివేత. నరేంద్ర అపస్మారక స్థితికి చేరిక. మున్సిపల్ రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఘటన. పొదిలి, మార్కాపురం జిల్లా: సూదనగుంట ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాల చించివేత. ఉదయగిరి, సీతారామపురం: వైయస్ఆర్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి చింతం రెడ్డి లోకేష్ నామినేషన్‌కు వెళ్తుండగా అడుగడుగునా పోలీసుల అడ్డంకులు. అద్దంకి: మున్సిపల్ ఎన్నికలు, నామినేషన్ల ఉపసంహరణ పరిణామాలపై వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్‌కుమార్ చింతలపూడి ఆందోళన. అమలాపురం: 25వ వార్డు వైయస్ఆర్‌సీపీ అభ్యర్థినితో పోలీసులు, టీడీపీ నాయకులు నామినేషన్ ఉపసంహరింపజేయడం. ఈ అంశంపై పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పినిపే శ్రీకాంత్ అభ్యంతరం. రాప్తాడు, అనంతపురం: రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు. పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు. నెల్లూరు: జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్‌రావు పొత్తు లేదని ప్రకటన. టీడీపీతో సీట్ల పంపకాలపై విభేదాలు. విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల్లో ఒకే వార్డుకు టీడీపీ, జనసేన నేతల వేర్వేరు బీ-ఫారాలు. జోనల్ కార్యాలయం వద్ద జనసేన నేతల నిరసన. శ్రీకాకుళం: మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టీడీపీకి రాజీనామా ప్రకటన. భర్త విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులు, తమను నమ్ముకున్నవారికి అన్యాయం జరిగిందని వెల్లడి. సుప్రీంకోర్టు ఆదేశాలు: నామినేషన్లు వేయకుండా అడ్డంకులు ఎదుర్కొన్న అభ్యర్థులకు అవకాశం కల్పించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని ఆదేశం. అవసరమైతే గడువు పొడిగింపు, అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించేలా సూచనలు. రాష్ట్ర ఎన్నికల సంఘం: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన తాత్కాలిక నిలిపివేత.