శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. కురుబవాండ్లపల్లికి చెందిన వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను టీడీపీ నేతలు చించివేసినట్లు సమాచారం. ఈ ఘటనకు నిరసనగా పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ధర్నా చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల హక్కులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ, ఘటనకు బాధ్యులైన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.