తునిలో నామినేషన్ల అడ్డగింత 

 కాకినాడ జిల్లా తొండంగి మండలంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్న కూటమి నాయకులు 

కాకినాడ జిల్లా: తుని నియోజకవర్గంలోని తొండంగి మండలంలో నామినేషన్ల దాఖలు సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా కూటమి నాయకులు అడ్డుకుంటున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పార్టీ కార్యకర్తలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల మధ్య పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు మండిపడ్డాయి. అభ్యర్థులు ఎలాంటి అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేలా పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Back to Top