రైల్వే కోడూరు నామినేషన్ కేంద్రం వద్ద  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ హల్‌చల్  

 మాజీ  ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నిర‌స‌న‌

 రైల్వేకోడూరు: ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, జనసేన నాయకులు తమ అనుచరులతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటూ, పార్టీ సానుభూతిపరులపై దాడులకు దిగుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. విషయం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీనియర్ నాయకుడు తోట శివసాయితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా నామినేషన్ కేంద్రానికి చేరుకుని నిర‌స‌న చేపట్టారు.

నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులతో కొరముట్ల శ్రీనివాసులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని పోలీసులకు తేల్చిచెప్పారు. అభ్యర్థులకు నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు.

Back to Top