ఆలూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై పోలీసుల దౌర్జన్యం

ఇంట్లో ఉన్న వినోద్‌ను బలవంతంగా తీసుకెళ్లేందుకు యత్నం

అడ్డుకున్న మహిళలపై ఎస్‌ఐ మన్మధ విజయ్‌ దాడికి దిగినట్లు సమాచారం

కర్నూలు జిల్లా: ఆలూరు మండల కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులపై పోలీసుల చర్యలతో ఉద్రిక్తత నెలకొంది. ఇంట్లో ఉన్న ఎంపీటీసీ అభ్యర్థి వినోద్‌ను ఎస్‌ఐ మన్మధ విజయ్‌ బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు స్థానిక పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో వినోద్‌ దుస్తులు చించివేశారని, పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలపై కూడా దాడికి దిగారని పేర్కొన్నాయి.

మహిళలంతా కలిసి ఎస్‌ఐను అడ్డుకోవడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను నిలిపివేసి, వారికి రక్షణ కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.
 

Back to Top