చిత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై దాడి!

 జడ్పీ చైర్మన్ కార్యాలయం వద్ద ఘటన 

చిత్తూరు జిల్లా: జడ్పీ చైర్మన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెనుమూరు జడ్పీటీసీ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు నారాయణస్వామిపై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన నాయకులపై దాడులు జరగకుండా పోలీసులు తగిన భద్రత కల్పించి, ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది.

Back to Top