విజయవాడ: శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ పదవికి తగిన గౌరవం, ప్రోటోకాల్ కల్పించడం లేదని మండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు పేర్కొన్నారు. ఈ అంశంపై గవర్నర్‌ను కలిసి తనకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. సభలో తన పట్ల అవమానకరంగా వ్యవహరించారని, రాజ్యాంగబద్ధమైన పదవికి ఇవ్వాల్సిన గౌరవాన్ని విస్మరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ అంశంపై మాట్లాడినందుకే కక్షసాధింపు? తిరుమల లడ్డూ వ్యవహారంపై మాట్లాడినందుకే తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తూమాటి మాధవరావు ఆరోపించారు. సభలో తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్తానని స్పష్టం చేశారు. తనకు ఎదురవుతున్న సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అర్హత లేనివారికి కీలక బాధ్యతలు ఎలా అప్పగిస్తారు? శాసనమండలి సెక్రటరీ జనరల్‌గా అర్హత లేని వ్యక్తిని నియమించారని తూమాటి మాధవరావు ఆరోపించారు. సభా వ్యవహారాల్లో నిబంధనలు, ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ తన విషయంలో వాటిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. డిప్యూటీ చైర్మన్ పదవికి తగిన గౌరవం కల్పించాల్సిన అవసరాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.