తాడేపల్లి: సీపీ బ్రౌన్‌కు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘తెలుగు భాషను తన మాతృభాషగా భావించి.. దాని గొప్పతనాన్ని గుర్తించడమే కాకుండా తెలుగు భాష వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సీపీ బ్రౌన్. తెలుగు సాహిత్యంలోని ఎన్నో విలువైన రచనలను వెలికితీసి వాటిని భావితరాలకు అందించేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.