కౌంటింగ్‌ కేంద్రాల్లో దౌర్జన్యకాండను నిరసిస్తూ భారీ ర్యాలీ

 కళ్యాణదుర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న 

అనంత‌పురం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా జరిగిన దౌర్జన్యకాండను నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త డా. తలారి రంగయ్య నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ వాల్మీకి సర్కిల్‌ మీదుగా సాగింది. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు జగదీష్‌, మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, బెస్తరపల్లి కృష్ణమూర్తితో పాటు ఐదు మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రాల్లో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను, ఎన్నికల ప్రక్రియను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు పేర్కొన్నారు.

Back to Top