తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న తీవ్ర ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే అత్యంత ప్రజాదరణ కలిగిన వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. రాజకీయంగా పరిస్థితి బాగా లేనప్పుడల్లా కుట్రలే బాబు నైజమని ఆయన వెల్లడించారు. చంద్రబాబునాయుడు కుట్ర సిద్ధాంతాల ప్రధాన సూత్రధారి అని ధ్వజమెత్తారు. తన బహిరంగ సభలకు జనం రాక, ఇచ్చిన సూపర్ సిక్స్ సహా ఏ ఒక్క ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చలేక ప్రజల్లో పూర్తిగా చులకనైన బాబు.. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక, హైదరాబాద్ ఈడీని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలకు తెర తీశారని తేల్చి చెప్పారు. జగన్ పేరు జపించకుండా చంద్రబాబుకు నిద్ర కూడా పట్టడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జూపూడి ప్రభాకర్‌రావు ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో జూపూడి ప్రభాకర్‌రావు ఇంకా ఏం మాట్లాడారంటే..: వైయస్ఆర్‌సీపీని అడ్డుకునేందుకే ఈ దొంగ దారులు: రాబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని చిత్తు చేసేందుకు వైఎస్ జగన్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారని, అది చూసి చంద్రబాబు వణికిపోతున్నారు. జగన్ ఏపీలో ఉంటే కూటమికి పుట్టగతులు ఉండవనే భయంతోనే.. 14 ఏళ్ల క్రితం కాంగ్రెస్, టీడీపీ కలిసి వేయించిన తప్పుడు కేసులను తెరపైకి తెచ్చి, ప్రతిరోజూ హైదరాబాద్ కోర్టుకు పిలిపించాలంటూ ఈడీ ద్వారా పిటిషన్లు వేయిస్తున్నారు. చంద్రబాబు జేబు సంస్థగా ఈడీ మారిందా?: హైదరాబాద్ ఈడీ చంద్రబాబు జేబు సంస్థలా, ఆయన చేతిలో తోలుబొమ్మలా మారింది. న్యూట్రల్‌గా ఉండాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థ రాజకీయ ప్రలోభాలకు తలొగ్గడం సిగ్గుచేటు. సీబీఐ తుది తీర్పు ఇచ్చేంత వరకు ఈడీ హద్దుల్లో ఉండాలని గతంలో జస్టిస్ భుయాన్ స్పష్టంగా తీర్పునిచ్చారు. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ మొట్టికాయలు వేసింది. అయినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈడీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చే ముందే ఎల్లో మీడియాలో వార్తలు ఎలా వస్తున్నాయి? చంద్రబాబుతో అధికారులు కుమ్మక్కై ఆడుతున్న నాటకం కాదా ఇది?. స్కిల్ స్కామ్ కేసుల్లో చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదు?: సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో రూ.241 కోట్ల నిధులు దారి మళ్లిన వ్యవహారంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఈడీ.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు ముట్టుకోలేదు? బాబుపై ఉన్న వేల కోట్ల అవినీతి కేసులను అధికారంలోకి రాగానే మూసేస్తుంటే ఈడీ ఎందుకు అడ్డు చెప్పలేదు? గతంలో వైఎస్ జగన్‌ను వేధించిన సీబీఐ అధికారి బొల్లేని శ్రీనివాసగాంధీ అవినీతిపరుడిగా తేలి ఈడీ చేతిలోనే బుక్కయ్యాడు. వ్యవస్థల్లో తమ మనుషులను పెట్టుకున్న చంద్రబాబు ఇలా దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని జూపూడి ప్రభాకర్‌రావు ఆక్షేపించారు.