అద్దంకి: అద్దంకి వైయస్ఆర్సీపీ కార్యాలయంలో పట్టణ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అద్దంకి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ హాజరై, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేస్తూ, అన్ని స్థానాల్లో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం పార్టీ కేడర్ సభ్యులకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న వైయస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.