బూడి ముత్యాల నాయుడు మాతృమూర్తి సింహాచలమ్మ మృతిపై వైయస్ జగన్ సంతాపం

మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాతృమూర్తి బూడి సింహాచలమ్మ (88) వయోభారంతో కన్నుమూయడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. సింహాచలమ్మ గారి మృతి బూడి ముత్యాల నాయుడు కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

మాతృవియోగం నుంచి తేరుకునే మనోధైర్యాన్ని బూడి ముత్యాల నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ, శ్రీ వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top