వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించారు. భోగాపురంలోని సన్ రే విలేజ్ రిసార్ట్లో జరిగిన వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు శ్రీ వైయస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు తనూజ–శివారెడ్డిలను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.