గన్నవరంలో టీడీపీకి షాక్‌.. వైయ‌స్ఆర్‌సీపీలోకి 100 మంది కార్యకర్తలు

 ఇస్లాంపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గంలో ఇస్లాంపేటకు చెందిన సుమారు 100 మంది టీడీపీ కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
 
నున్నలో వైయ‌స్ఆర్‌సీపీ గ్రామ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
 
విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ గ్రామ పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్‌ అవుతు శైలజారెడ్డి, కొమ్మా కోట్లు, యార్కరెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top