మైదుకూరులో వైయ‌స్ఆర్‌సీపీలోకి 200 కుటుంబాల చేరిక

కండువాలు కప్పి ఆహ్వానించిన వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు

మైదుకూరు: వైయ‌స్ఆర్‌ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్‌నగర్‌ 7వ వార్డులో వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ వార్డుకు చెందిన సుమారు 200 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి ఎస్‌.బి. అంజాద్‌ బాషా, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కుటుంబాలకు నాయకులు స్వాగతం పలికారు. వార్డులో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

Back to Top