డోన్: నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలోని నక్కలవాగుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తుమ్మల కిష్టన్న యాదవ్‌తో పాటు ఆయన అనుచరులు తుమ్మల గోపాల్ యాదవ్, తుమ్మల జనార్దన్ యాదవ్, షేక్ అస్సేన్ సోమవారం వైయస్ఆర్సీపీలో చేరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్కలవాగుపల్లి గ్రామ వైయస్ఆర్సీపీ నాయకులు వై. భాస్కర్ రెడ్డి, వై. మురళీధర రెడ్డి, వై. రామ్మోహన్ రెడ్డి, ఎస్. ఇస్మాయిల్, టీ. సోమయ్య యాదవ్, ఎం. మనోహర్, పి. రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.