అడిలైడ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట

అడిలైడ్‌: ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో  బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంప్‌బెల్‌టౌన్‌ సిటీ ఫంక్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలకు అడిలైడ్‌లోని తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి.

మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ ఆటపాటలతో వేడుకల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం రుచికరమైన తెలుగు వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. విదేశాల్లోనూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ బతుకమ్మ పండుగను నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఫౌండేషన్‌ కమిటీ సభ్యులు వంశీ బొంతు, ప్రసన్న కుమార్ రెడ్డి అట్లూరి, రామ్ మునగాల, ఉదయ్ కుందం, కిషోర్ అనుమోలు, విజయ్ వంగా, నవీన్ గుర్రాల, ప్రవీణ్ మునగాల, భాను పుట్టా, భాస్కర్ రెడ్డి సమన్వయంతో వేడుకలు విజయవంతంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు సమాజ సభ్యులందరికీ ఫౌండేషన్‌ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

Back to Top