రేప‌ల్లెలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై సమావేశం

బాపట్ల జిల్లా: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైయ‌స్ఆర్‌సీపీ సన్నద్ధతపై రేపల్లె మండల సమావేశం నిర్వహించారు. రేపల్లెలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పంచాయతీల వారీగా నాయకులతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా పంచాయతీల్లో పార్టీ పరిస్థితి, నాయకులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.

Back to Top