పార్టీ బలోపేతానికి ఐక్యంగా కృషి చేయాలి

మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ‌య్య చౌద‌రి

ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆదేశాల మేరకు దెందులూరు మండలం పెరుగుగూడెం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ వివిధ కమిటీల్లో నూతనంగా నియమితులైన నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు నిట్ట లీలానలకాంతం, రాష్ట్ర కార్యదర్శులు ధూళిపాళ నాగేంద్ర వరప్రసాద్‌, కట్టా ఏసుబాబు, కొవ్వలి గ్రామ పార్టీ అధ్యక్షుడు కాటి సుధాకర్‌, దెందులూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు కొలుసు గణపతి, మండల ప్రధాన కార్యదర్శి నల్లూరి వెంకట రామయ్య, యలమర్తి సత్తిబాబు, రాజు, ముప్పవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు మధు, జిల్లా ఎస్సీ విభాగ కార్యదర్శి మురళి, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతనేని సుధీర్‌, శ్రీరామవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు అక్కినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Back to Top