అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

 రాష్ట్ర ప్రజలకు, మహిళలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థన

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అమ్మవారి ఆశీస్సులు లభించాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మహిళలందరికీ మంచి జరగాలని ప్రార్థించానని, భక్తులందరూ ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సూచించారు.

Back to Top