డంగభద్రలో టీడీపీకి చెందిన 30 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

 కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి

పార్వతీపురం మన్యం జిల్లా: జియ్యమ్మవలస మండలం డంగభద్ర గ్రామంలో టీడీపీకి చెందిన 30 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. గ్రామానికి చెందిన వైస్‌ సర్పంచ్‌ లింగరోతు గోవింద నాయుడు, వార్డు మెంబర్‌ రాగోలు గంగునాయుడు, గంట్యాడ గణపతి నాయుడు, వావులపల్లి తాతబాబుతో పాటు పలువురు నాయకులు, వారి కుటుంబ సభ్యులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు, కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపి, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ చేరికలతో గ్రామంలోని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Back to Top